Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 10, 2026Short Read
స్థానిక పోరు: కొత్త ముఖాలకూ జనసేన తలుపులు తెరిచింది!
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై జనసేన కీలక నిర్ణయం తీసుకుంది.
తొందరపడి అభ్యర్థులను ఖరారు చేయవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ సమన్వయకర్తలు, సభ్యులకు సూచించారు.
ఈ నెల 15వ తేదీ నుంచి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు.స్థానిక సంస్థల పోరులో పోటీ చేసేందుకు పార్టీలో కొత్తగా చేరిన వారికి కూడా సమ ప్రాధాన్యం ఇస్తూ, వారికి పోటీ చేసే అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.
అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంతకం చేసిన B-ఫారం మాత్రమే అధికారికంగా చెల్లుతుందని, కార్యకర్తలంతా నియమనిబంధనలకు కట్టుబడి పనిచేయాలని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.





